బ్రెజిల్‌లో రోడ్డు ప్రమాదం.. 37మంది మృతి

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్ర గాయాపడ్డారు. సాపాలో రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్స్‌టైల్‌ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న

Published : 26 Nov 2020 01:41 IST

బొగోటా: బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్ర గాయాపడ్డారు. సాపాలో రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్స్‌టైల్‌ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొని ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి దేహాలను బయటకు తీసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా పట్టణంలో మూడు రోజుల సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని