వివేకా హత్యకేసు:కొనసాగుతున్న సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన మున్నా,

Published : 25 Sep 2020 01:04 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని, అతని కుటుంబసభ్యులను గత నాలుగు రోజుల నుంచి విచారిస్తున్న సీబీఐ అధికారులు ఇవాళ కూడా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో మరోసారి ప్రశ్నిస్తున్నారు. పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహించే వ్యక్తికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు లాకర్‌లో రూ.48లక్షల నగదు, 25 తులాల బంగారం ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. 

చెప్పుల దుకాణం యజమానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఆయనతో సంబంధం ఉన్న మరికొందరు యువకులను కూడా సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. కడపలోనే కాకుండా పులివెందులలో కూడా సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఓ బృందం చెప్పుల దుకాణం యజమాని స్నేహితులు, సన్నిహితులను విచారిస్తున్నట్లు సమాచారం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని