Published : 27 Sep 2020 15:35 IST

ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణి సహా 7గురు మృతి!

 బెంగళూరు: కర్ణాటకలోని కలబుర్గిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మరణించారు. మరణించిన వారిలో గర్భిణి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం కలబుర్గి సమీపంలోని సవలగి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సవలగి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక గర్భిణి కూడా ఉన్నారు. మరణించిన వారిలో 25 ఏళ్ల గర్భిణి ఇర్ఫానా బేగం, రుబియా బేగం, అబేదాబి, జయ చునాబి, మునీర్‌, మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీగా గుర్తించాం’ పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని