అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం

నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో ఓ ట్యాంకర్‌ లారీ అదుపుతప్పి ఇతర వాహనాలను తప్పిస్తూ రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈప్రమాదంలో ట్యాంకర్‌ లారీ నుంచి ఇంధనం ..

Published : 26 Oct 2020 01:04 IST

అబ్దుల్లాపూర్‌మెట్ (హైదరాబాద్‌): నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో ఓ ట్యాంకర్‌ లారీ అదుపుతప్పి ఇతర వాహనాలను తప్పిస్తూ రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈప్రమాదంలో ట్యాంకర్‌ లారీ నుంచి ఇంధనం లీకవడంతో అగ్నిప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శకటాన్ని రప్పించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. లారీ జాతీయ రహదారిపై కాకుండా కవాడిపల్లి మార్గంలో బోల్తాపడటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని