Crime News: మోసం చేశావని ప్రశ్నించినందుకు.. భార్యను కారుతో తొక్కించిన నిర్మాత

తననెందుకు మోసం చేస్తున్నావని గొడవపడిన  భార్యను కారుతో తొక్కించాడో సినీ నిర్మాత. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

Updated : 27 Oct 2022 10:31 IST

ముంబయి: తననెందుకు మోసం చేస్తున్నావని నిలదీసిన భార్యను కారుతో తొక్కించాడో సినీ నిర్మాత. ఇటీవల ముంబయిలోని అంధేరీలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  దాడి దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివరాలు వెల్లడించారు. 

బాధితురాలి భర్త పేరు కమల్‌ కిశోర్‌ మిశ్రా. అతడు సినీ నిర్మాత. ఇటీవల ఓ రోజు భర్త ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె వెతుక్కుంటూ పార్కింగ్ ప్రదేశానికి వచ్చింది. అక్కడ కారులో ఉన్న తన భర్త వెంట మరో మహిళ ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే ఆగ్రహంతో భర్తతో గొడవకు దిగింది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న భార్యను పట్టించుకోకుండా అతడు వేగంగా కారు నడిపాడు. దాంతో ఆమె తల, కాళ్లూచేతులకు గాయాలయ్యాయి. గాయపడిన భార్యను వదిలి అతడు పరారయ్యాడు. ఘటనాస్థలంలో ఉన్నవారు ఆమెను  ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని