బహుమతుల పేరుతో భారీ మోసం

ఈ కామర్స్‌లో మరొక మోసాన్ని సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేశారు. బిహార్‌లోని కబీర్‌పూర్‌కి చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ కామర్స్‌ ...

Published : 04 Jan 2020 00:54 IST

హైదరాబాద్‌: ఈ కామర్స్‌లో మరో మోసాన్ని సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేశారు. బిహార్‌లోని కబీర్‌పూర్‌కి చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ కామర్స్‌ నుంచి డేటాను సేకరించి బహుమతుల పేరుతో వినియోగదారులకు గాలం వేస్తోంది. ఈ కామర్స్‌లోని డేటా లేకేజీపై దృష్టిపెట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బిహార్‌ ముఠా అక్రమాలను గుర్తించారు. స్నాప్‌డీల్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థల డేటాను ఈ ముఠా సేకరించింది. ఈ కామర్స్‌లో డేటా లేకేజీపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహుమతులు వచ్చాయంటూ వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో బిహారీ గ్యాంగ్‌ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని