శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌, మస్కట్‌ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం..

Published : 25 Jan 2020 00:37 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌, మస్కట్‌ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ. 1.66 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారంతోనే నలుగురు ప్రయాణికులను తనిఖీ చేసి బంగారాన్ని గుర్తించినట్లు డీఆర్‌ఐ అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని