కమాండోను గొలుసులతో కట్టి..కొట్టి..

మాస్కు ధరించలేదని ఓ సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండోను అరెస్టు చేసిన పోలీసులు అతడిని గొలుసులతో కట్టివేసి ఉంచడం చర్చనీయాంశమైంది. కర్ణాటక రాష్ట్రం బెలగావి పోలీసుస్టేషన్‌లో కమాండో సచిన్ సునీల్ సావంత్‌ను గొలుసులతో కట్టివేసి ఉంచిన ఓ వీడియో..

Published : 28 Apr 2020 00:34 IST

గొలుసులతో కట్టివేసి ఉంచడంపై రేగిన దుమారం

దిల్లీ: మాస్కు ధరించలేదని ఓ సీఆర్‌పీఎఫ్‌ జవానును అరెస్టు చేసిన పోలీసులు అతడిని గొలుసులతో కట్టివేసి ఉంచడం సంచలనం కలిగించిఇంది. కర్ణాటక రాష్ట్రం బెలగావి పోలీసుస్టేషన్‌లో కమాండో సచిన్ సునీల్ సావంత్‌ను గొలుసులతో కట్టివేసి ఉంచిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. ఆ వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేయగా.. దీనిపై సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు స్పందించారు. కర్ణాటక రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారికి ఈ విషయంపై లేఖ రాశారు. ఈసందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ మాట్లాడుతూ.. ఈ కేసును కర్ణాటక పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వచ్చే మంగళవారం కమాండో బెయిల్‌ పిటిషన్ కోర్టు ముందుకు వస్తుందని తెలిపారు. కేసును ఓ కొలిక్కి తీసుకురావడానికి దర్యాప్తు కొనసాగించాలని పేర్కొన్నారు.

ఈ కేసుపై స్పందించిన కర్ణాటక పోలీసులు మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 23న ఎలాంటి మాస్కు ధరించకుండా సావంత్‌ వీధుల్లో సంచరిస్తున్నాడని, ప్రశ్నించిన పోలీసుపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. అందుకే అరెస్టు చేసి ఠాణాకు తరలించి బంధించినట్లు తెలిపారు. ఈ కేసుపై స్పందించిన సావంత్‌ కుటుంబసభ్యులు పోలీసులు కమాండోని లాఠీలతో కొట్టారని, అతడిని హింసించారని ఆరోపించారు. కమాండో సావంత్‌ ఏప్రిల్‌ 11 వరకు సెలవుపై ఉన్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అతడు సెలవులు పొడిగించుకోవాల్సి వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని