
Updated : 09 Jul 2020 12:06 IST
కారు బోల్తా..ముగ్గురి మృతి
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా సింగనమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన ఒకే కేటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో గొల్లపల్లి సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అమర్‌నాథ్ (40), రాజు (28), చెన్నమ్మ(65)లు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో రాప్తాడు ఎస్సై ఆంజనేయులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
Tags :