Software Engineer: అత్తింటి వేధింపులకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలి

అత్తింటి వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణం చెందిన ఘటన కామారెడ్డి జిల్లాకేంద్రంలో దేవివిహార్‌లో ఆదివారం చోటుచేసుకుంది. దేవునిపల్లి ....

Updated : 01 Nov 2021 09:30 IST


భర్త హరిప్రసాద్‌, పిల్లలతో శిరీష

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: అత్తింటి వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణం చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవివిహార్‌లో ఆదివారం చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. కార్తీక అలియాస్‌ శిరీష(32)కు హరిప్రసాద్‌(35)తో 2013లో వివాహమైంది. వీరికి కవలలు జన్మించారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఆమె కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా భర్తతోపాటు అత్త బాలరాజవ్వ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి చేసేవారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పుట్టింటి వారు తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలని పరితపించేదని, కానీ ఆశలు తీరకుండానే ఆయువు తీశారని కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని