Crime News: ఆవుపై అఘాయిత్యం.. ఉరి పడి గోమాత మృతి

హిందువులు ఆరాధ్య దైౖవంగా, గోమాతగా పిలుచుకునే ఆవుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన బుధవారం అర్ధరాత్రి నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిటికీ ఊచలకు కట్టిన తాడు మెడకు ఉరిపడి

Updated : 01 Apr 2022 16:23 IST

లోకేశ్వరం, న్యూస్‌టుడే: హిందువులు ఆరాధ్య దైౖవంగా, గోమాతగా పిలుచుకునే ఆవుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన బుధవారం అర్ధరాత్రి నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిటికీ ఊచలకు కట్టిన తాడు మెడకు ఉరిపడి గోమాత మృతిచెందింది. స్థానిక ఎస్సై సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పిప్రి గ్రామానికి చెందిన రైతు రావుల సాయన్న కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇంట్లో మార్బుల్‌ వేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలను తెప్పించారు. వీరిలో నిందితుడు విజయ్‌ బుధవారం అందరూ నిద్రించాక సాయన్నకు చెందిన ఆవును నూతన గృహంలోకి తీసుకొచ్చి కిటికీ ఊచలకు తాడుతో బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు. పెనుగులాటలో మార్బుల్‌ బండలు జారి ఊచలకు కట్టిన తాడు మెడకు ఉరిగా బిగించుకోవడంతో ఆవు మృతిచెందింది. ఉదయం పెరట్లో గోమాత కనిపించక పోవడంతో వెతికిన రైతుకు కొత్త ఇంట్లో మరణించి ఉండడం, కూలీ విజయ్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా సదరు కూలీ తను చేసిన అఘాయిత్యాన్ని ఒప్పుకోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పశువైద్యాధికారి జెస్సీ గోవుకు పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని