Hyd News: మసాజ్‌ థెరపిస్ట్‌పై హత్యాయత్నం కేసులో అంతర్గత విచారణ!

మసాజ్‌ థెరపిస్ట్‌ని ఇంట్లో నిర్భందించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో పోలీసుల అంతర్గత విచారణ

Published : 18 May 2022 09:52 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మసాజ్‌ థెరపిస్ట్‌ని ఇంట్లో నిర్భందించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో పోలీసుల అంతర్గత విచారణ ప్రారంభమైంది. బంజారాహిల్స్‌కు చెందిన సంజన దిల్లీలో ఉన్న తన స్నేహితురాలు, మసాజ్‌ థెరపిస్ట్‌ కకూలి బిశ్వాస్‌ను హైదరాబాద్‌ రప్పించింది. ఈనెల 13న ఆమెను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.25లోని ఓ ఇంటికి పంపారు. అప్పటికే అక్కడ ఉన్న సంజన స్నేహితురాళ్లు కోమటి, సునీతలతో కలిసి అయిదుగురు వ్యక్తులకు మసాజ్‌ చేయడానికి వెళ్లారు. అనంతరం శారీరక సుఖం కోరుకున్న వారికి అనుగుణంగా వ్యవహరించలేదని బిశ్వాస్‌తో కోమటి, సునీత గొడవకు దిగారు. బిశ్వాస్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొనేలోగా, కోమటి, సునీత వెళ్లిపోయారు. డబ్బు విషయంలో గొడవ జరిగిందని, తనను కొట్టారంటూ బిశ్వాస్‌ పోలీసులకు తెలిపింది. తాము రాజీపడ్డామని వివరించింది. ఈ క్రమంలోనే ఠాణాలో మహిళా ఎస్సైకి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదుకు బిశ్వాస్‌ ముందుకు రాకపోవడంతో అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోయారు. పీటా కేసు నమోదు చేయకుండా ఎలా ‘సెటిల్‌’ చేస్తారని పెట్రోలింగ్‌ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బిశ్వాస్‌ తన ఇష్టంతో వచ్చానని, సమస్య లేదని పోలీసులకు తెలియజేయడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఉన్నతాధికారులకు ఈ మేరకు నివేదిక అందించారు. ఈ ఘటనలో ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని బంజారాహిల్స్‌ పోలీసులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని