Hanumakonda: హనుమకొండ ప్రసూతి ఆసుపత్రిలో బీర్లతో మహిళా సిబ్బంది పార్టీ

అది ప్రసూతి ఆసుపత్రి. నిత్యం వందలాది మంది గర్భిణులు చికిత్స కోసం వస్తుంటారు. పదుల సంఖ్యలో ప్రసవాలు జరిగి వార్డుల్లో తల్లీ బిడ్డలు ఉంటారు.

Updated : 27 Oct 2022 11:24 IST

ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, నయీంనగర్‌


స్నేహితురాళ్లతో మహిళా సిబ్బంది..

అది ప్రసూతి ఆసుపత్రి. నిత్యం వందలాది మంది గర్భిణులు చికిత్స కోసం వస్తుంటారు. పదుల సంఖ్యలో ప్రసవాలు జరిగి వార్డుల్లో తల్లీ బిడ్డలు ఉంటారు. వైద్యులతోపాటు, సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకొని సేవలు అందించాల్సి ఉంటుంది. అలాంటిది ఇద్దరు మహిళా సిబ్బంది తమ బాధ్యత మరిచి వ్యవహరించారు. మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బీర్లు తాగి విందు చేసుకున్నారు. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది ఇటీవల మరో ఇద్దరు బయటి మహిళలను పిలిపించి ఓ గదిలో బీర్లుతాగి చిందేశారు. పుట్టిన రోజు వేడుకల పేరిట సాయంత్రం వేళ తమ గదిలో పార్టీ చేసుకున్నారు. వీరు విందు చేసుకొనే దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. ఈ ఘటన ఆసుపత్రిలోని ఇతర సిబ్బందికి తెలిసింది. ఆసుపత్రి ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో వారు మహిళా సిబ్బందిని పిలిపించి మందలించి వదిలేసినట్టు సమాచారం. ఆసుపత్రిలో ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై  కఠినంగా చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండు చేస్తున్నారు. ఈ విషయమై ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్‌ విజయలక్ష్మిని ‘ఈనాడు’ ఫోన్‌లో వివరణ కోరగా.. వారు విందు చేసుకున్నట్టు తమ దృష్టికి రాగానే పిలిచి గట్టిగా హెచ్చరించామని తెలిపారు.


పడేసిన సీసాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని