Crime News: కానుకల కోసం ఆశపడి.. రూ.1.12 కోట్లు పోగొట్టుకుని..

సైబర్‌ నేరగాడి మాయలో పడిన ఓ మహిళ రూ.కోటికి పైనే ముట్టజెప్పిన ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

Updated : 20 Nov 2022 08:34 IST

అలీబాగ్‌: సైబర్‌ నేరగాడి మాయలో పడిన ఓ మహిళ రూ.కోటికి పైనే ముట్టజెప్పిన ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఆ మహిళ కోర్టు సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సోషల్‌ మీడియాలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను యూకేలోని మాంచెస్టర్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. ఇటీవల ఆమెకు ఫోన్‌ చేసి.. బంగారు బహుమతులు, డబ్బు పంపిస్తున్నానని చెప్పాడు. వాటిని తీసుకోవాలంటే కస్టమ్స్‌ సుంకం చెల్లించాలంటూ బురిడీ కొట్టించాడు. దీంతో ఆమె ఆ వ్యక్తి చెప్పిన ఖాతాకు రూ.1.12కోట్లు బదిలీ చేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని