క్రీడా పాఠశాలలో లైంగిక వేధింపులు

తాను శిక్షణనిచ్చే బాలికలపై  లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో కోచ్‌. అతని ఆగడాలు బయటపడడంతో  సస్పెన్షన్‌ వేటుపడింది.

Published : 19 Mar 2023 03:07 IST

కోచ్‌ను సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌

ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: తాను శిక్షణనిచ్చే బాలికలపై  లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో కోచ్‌. అతని ఆగడాలు బయటపడడంతో  సస్పెన్షన్‌ వేటుపడింది. ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాలలో బి.రవీందర్‌ అథ్లెటిక్స్‌ శిక్షకుడిగా పని చేస్తున్నాడు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకు అయిదేళ్లుగా శిక్షణనిస్తున్నాడు. ఈ క్రమంలో బాలికలపై అనుచితంగా ప్రవర్తిస్తూ... వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే తమనే తప్పు పడతారని భయంతో బాలికలు వెనుకంజ వేశారు. ఇటీవల అనారోగ్యంతో ఇంటికి వెళ్లిన ఓ బాలికతో వాట్సాప్‌లో అసభ్యంగా చాటింగ్‌ చేశాడు. బాలిక ఆ చాటింగ్‌ను కేర్‌ టేకర్‌కు చూపించగా, ఆమె ప్రిన్సిపాల్‌ వజ్రమాల దృష్టికి తీసుకొచ్చారు. విషయాన్ని  తీవ్రంగా పరిగణించిన ప్రిన్సిపాల్‌ జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లుకు తెలిపారు. విచారణలో మరో బాలిక సైతం కోచ్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ కోచ్‌ను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని