బాలికపై గ్యాంగ్‌రేప్ చేసి.. పురుగుమందు తాగించారు
బిహార్‌లోని వైశాలి జిల్లాలో పదిహేనేళ్ల బాలికపై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బిహార్‌లోని వైశాలి జిల్లాలో పదిహేనేళ్ల బాలికపై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెకు పురుగుమందు తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ బాలిక తన అమ్మమ్మతో కలిసి నివసిస్తోంది. తల్లిదండ్రులు పట్నాలో ఉంటున్నారు. గురువారం రాత్రి బహిర్భూమి కోసమని ఆమె బయటకు వెళ్లింది. ఆమెను అనుసరించిన అయిదుగురు నిందితులు దగ్గర్లో ఉన్న మామిడితోటలోకి ఈడ్చుకుపోయి.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక.. తన అమ్మమ్మకు జరిగిన విషయం చెప్పి స్పృహతప్పి పడిపోయింది. బాధితురాలిని అంబులెన్సులో హాజిపుర్ సర్దార్ ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చేరుకొన్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్పృహలోకి వచ్చాక ఆమె వాంగ్మూలం తీసుకొని, నిందితులు ఎవరన్నది దర్యాప్తు చేస్తామని పాతేపుర్ ఎస్‌ఐ పల్లవీకుమారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్