Crime newss: గోవా రిసార్ట్‌లో దారుణం.. విదేశీ బాలికపై స్విమ్మింగ్‌ పూల్‌లో అత్యాచారం

గోవాలోని ఓ రిసార్టులో విదేశీ బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన......

Published : 13 May 2022 02:25 IST

పనాజీ: గోవాలోని ఓ రిసార్టులో విదేశీ బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై ఉత్తర గోవాలోని అరంబోల్‌లో రిసార్టులో రూమ్‌ అటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా.. అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తన కుమార్తెపై స్విమ్మింగ్‌పూల్‌లో, ఆ తర్వాత హోటల్‌ గదిలో ఈ నెల 6న అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తల్లి పెర్నెమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. దగ్గర్లో ఉన్న మార్కెట్లో కొన్ని వస్తువులు కొనుక్కొనేందుకు బయటకు వెళ్లినప్పుడు తన కూతురిని స్విమ్మింగ్‌ పూల్‌లో వదిలేసి వెళ్లినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడని పెర్నెమ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ నాయక్‌ తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన 24గంటల్లోనే అతడు కర్ణాటకలోని గదగ్‌కు చెందిన 28 ఏళ్ల రవి లమనిగా గుర్తించి.. ఈ నెల 10న అరెస్టు చేసినట్టు వివరించారు. నిందితుడికి వివాహం కూడా అయిందన్నారు. ఈ కేసులో నిందితుడిపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని