Andhra News: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్‌!

తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది..........

Updated : 18 Jul 2022 21:57 IST

రాజమహేంద్రవరం: తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  జూన్‌ 17న ఆయన దాఖలు చేసిన  బెయిల్‌ పిటిషన్‌ రద్దు కాగా..  తాజాగా రెండో బెయిల్‌ పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. డ్రైవర్‌ హత్యకేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మరోవైపు అనంతబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తున్నారు. వారి తరఫున పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కేసు వాదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని