ప్రతీకారమే హత్య చేయించింది!

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్‌ అసద్‌ఖాన్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 04 Apr 2021 05:20 IST

మైలార్‌దేవ్‌పల్లి హత్య కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్‌ అసద్‌ఖాన్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.  ఈమేరకు కేసు వివరాలను ఆయన వెల్లడించారు. అసద్‌పై ఆరుగురు వేట కొడవళ్లతో దాడి చేశారన్నారు. అసద్‌ అల్లుడు యాసిన్‌ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడని చెప్పారు. 2018లో అంజద్‌ఖాన్‌ హత్య కేసులో అసద్‌ నిందితుడిగా ఉన్నాడని, తన నాన్నను చంపాడనే ప్రతీకారంతోనే కుమారుడు యాసిన్‌ ఈ హత్య చేశాడని డీసీపీ తెలిపారు. స్నేహితుల సహకారంతో హత్యకు పాల్పడ్డాడని చెప్పారు. 

‘‘ ఈ నెల 1న బైకుపై వెళ్తున్న అసద్‌ను నిందితులు ఆటోతో ఢీ కొట్టారు. కిందపడిన అసద్‌పై ముగ్గురు వేటకొడవళ్లతో దాడి చేశారు. హత్య తర్వాత ఆటోలో పారిపోయారు. బైకు వెనుక కూర్చున్న బాబా అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో లభ్యమైన ఆధారాలతో నిందితులను గుర్తించాం.వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపాం’’ అని డీసీపీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని