
Updated : 24 Aug 2021 10:37 IST
Road Accident : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
నల్గొండ: మిర్యాలగూడలో రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే వద్ద ఆగిఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు.
మృతులను మల్లికార్జున్(40), నాగేశ్వరరావు(44), జయరావు(42)గా గుర్తించారు. వీరిలో మల్లికార్జున్‌ది ప్రకాశం జిల్లా పెద్ద కల్వకుంట కాగా.. నాగేశ్వరరావుది అదే జిల్లా ముఖ్యనవారి పాలెం. మరో మృతుడు జయరావుది గుంటూరు జిల్లా నాగులవరం గ్రామంగా పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
Tags :