Ap News: ఆముదం గింజలు తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థత

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబర్లపల్లెలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆముదపు..

Updated : 19 Aug 2021 21:55 IST

వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబర్లపల్లెలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆముదం గింజలు తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు... కుంభార్లపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొంత మంది విద్యార్థులు ఆడుకుంటూ, ఆవరణలో ఉన్న ఆముదం గింజలను తిన్నారు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు సైతం ఆ గింజలు తిని ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే విద్యార్థులకు వాంతులు మొదలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఆసలు విషయం బయటపడింది. ఆముదం గింజలు తిన్న దాదాపు 27 మంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరిలో 24 మంది విద్యార్థులకు చికిత్స అందించి ఇళ్లకు పంపించగా.. ముగ్గురు విద్యార్థులను పర్యవేక్షణలో ఉంచనున్నట్లు వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ప్రసాద్‌బాబు ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని