TS news: వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు.. 

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద వ్యవసాయ

Updated : 29 Jul 2021 18:32 IST

చిగురుమామిడి: కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారును బావి నుంచి వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కారు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. వాహనంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని