
Karvy Stock Broking case: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మరో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కార్వీ సంస్థ సీఎఫ్‌వో కృష్ణహరి, సీఈవో రాజీవ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డొల్ల కంపెనీల పేరుతో కృష్ణ హరి, రాజీవ్ మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి ఆదేశాలతోనే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తేల్చారు. ఏడేళ్లుగా ఈ ఇద్దరు నిందితులు డొల్ల కంపెనీలను నిర్వహిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి సంస్థ ఛైర్మన్ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంకులో తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన పూర్తి వివరాలను పార్థసారథి నుంచి సేకరించినట్లు సమచారం. పెట్టుబడిదారులకు చెందిన డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను బ్యాంకులో తనఖా పెట్టి రూ.137 కోట్లను పార్థసారథి రుణంగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 26, 27 తేదీల్లో పార్థసారథిని ప్రశ్నించినప్పటికీ పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో నాంపల్లి న్యాయస్థానం అనుమతితో మరోసారి పార్థసారథిని రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కార్వీ సంస్థ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సీసీఎస్ పోలీసులు రాబట్టారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌తో పాటు అనుబంధ సంస్థలకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాలను ఇప్పటికే సీసీఎస్ పోలీసులు స్తంభింపజేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.