ED raids: శ్రీకృష్ణ జ్యువెలరీ షాపులపై ఈడీ దాడులు 

నగరంలోని శ్రీకృష్ణ జ్యువెలరీ దుకాణాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయం సహా ఇతర షాపులు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.

Updated : 07 Oct 2021 12:08 IST

హైదరాబాద్‌: నగరంలోని శ్రీకృష్ణ జ్యువెలరీ దుకాణాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయం సహా ఇతర షాపులు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రూ. 330 కోట్లు విలువైన 1100 కేజీల బంగారం ఆభరణాలను మళ్లించి నిబంధనలు విరుద్ధంగా వ్యవహారించినందుకు గతంలో ఈ జువెల్లర్స్‌పై డీఆర్‌ఐ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా రావిరాల యూనిట్లో ఈ అక్రమాలకు  వెలుగులో వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి 2019లో సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఆ కేసు ఆధారంగానే మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు వివరాలు సేకరించి ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని