Crime News: రూ.7కోట్లు తిరిగిచ్చేస్తా.. పోలీసుల విచారణలో శిల్పా చౌదరి

పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసులో పోలీస్‌ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో

Published : 13 Dec 2021 01:20 IST

హైదరాబాద్‌: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసులో పోలీస్‌ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ సందర్భంగా శిల్పా చౌదరి నుంచి నార్సింగ్‌ పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఆమె ఖాతాలో రూ.16వేలు, భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఖాతాలో రూ.14వేలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శిల్ప ఇప్పటి వరకు రూ.కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 కేసుల్లో రూ.7కోట్లు మోసం చేసినట్టు ఆమెపై బాధితులు ఫిర్యాదు చేశారు. ముగ్గురికీ రూ.7కోట్లు తిరిగిచ్చేస్తానని శిల్పాచౌదరి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల నుంచి శిల్ప రూ.7కోట్లకు పైగా తీసుకొని ఎగవేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్ప అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచి భారత్‌కు వచ్చి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10కోట్లకు పైగా ఇచ్చినట్టు శిల్ప  చెప్పినప్పటికీ తగిన ఆధారాలు ఇవ్వలేదు. ఆమె మోసాలపై నార్సింగ్‌ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని