Viveka Murder case: సీబీఐ చేతికి కీలక ఆధారం... విచారణకు పిలవకుండానే అరెస్టుకు అవకాశం?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలం పత్రాలను

Published : 24 Feb 2022 01:38 IST

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలం పత్రాలను సీబీఐ అధికారులు కోర్టు ద్వారా తీసుకున్నారు. ఈనెల 21న దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్‌ ఎదుట దాదాపు 4గంటల పాటు వాంగ్మూలం ఇచ్చారు. అప్రూవర్‌గా మారిన తర్వాత దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు కేసులో కీలకం కానుంది. ఈ వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్న అంశాలు... ఇతర వివరాలపై సీబీఐ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు 31న దస్తగిరి.. ప్రొద్దుటూరు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అందులో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఇప్పుడు అప్రూవర్‌గా మారిన తర్వాత దస్తగిరి మరింత పకడ్బందీగా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు సీబీఐ అధికారులకు కీలకం కానుంది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న పలువురి పేర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులను విచారణకు పిలవడం లేదంటే.. ఆధారాలుంటే అరెస్టు చేసే ప్రక్రియను సీబీఐ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని