logo

రైతు సమస్యలపై కాంగ్రెస్‌ పోరుబాట

రైతు సమస్యలపై బుధవారం బేలలో కాంగ్రెస్‌ పోరుబాట చేపట్టింది. ఏక కాలంలో రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్‌ రద్దు, పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎడ్లబళ్లతో ర్యాలీ నిర్వహించారు.

Published : 01 Dec 2022 05:42 IST

బేలలో ర్యాలీగా వస్తున్న డీసీసీ ఇన్‌ఛార్జి అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, ఏఐసీసీ సభ్యురాలు సుజాత, తదితరులు

బేల, న్యూస్‌టుడే : రైతు సమస్యలపై బుధవారం బేలలో కాంగ్రెస్‌ పోరుబాట చేపట్టింది. ఏక కాలంలో రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్‌ రద్దు, పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎడ్లబళ్లతో ర్యాలీ నిర్వహించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజారెడ్డి ఇంటి నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారి గుండా తహసీల్దార్‌ కార్యాలయం వరకు కొనసాగింది. దారి పొడవునా పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. కార్యక్రమానికి డీసీసీ ఇన్‌ఛార్జి అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, అసెంబ్లీ సమన్వయకర్త వోడ్నల శ్రీనివాస్‌ హాజరయ్యారు.  రైతు రుణమాఫీ సాధించే వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ బి.రాంరెడ్డికి అందజేశారు. పార్టీ నేతలు సంజీవ్‌రెడ్డి, శ్రీధర్‌, రాందాస్‌ నాక్లే, పైజుల్లాఖాన్‌, వామన్‌ వాంకడే, సంజయ్‌ గుండావార్‌, ఖాడే సంతోష్‌, రూపేష్‌రెడ్డి, అంబకంటి అశోక్‌, మోతిరాం, శాంతన్‌రావు, గన్‌శ్యాం, విఠల్‌, శంకర్‌, అఖిల్‌, అవినాష్‌, చంద్రకాంత్‌, రాకేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని