logo

తొలి ప్రయత్నం.. విజయ కేతనం

కష్టపడి పైకి వచ్చిన తల్లిదండ్రులను చూస్తూ పెరిగారు. సమాజ సేవ చేయాలనే తల్లిదండ్రుల ఆశయాన్నే సంకల్పంగా పెట్టుకున్నారు. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించి ప్రణాళిక నిర్ధేశించుకుని కష్టపడి చదివారు.

Updated : 24 Mar 2023 06:26 IST

పాతికేళ్లకే న్యాయమూర్తిగా నియామకం
మందమర్రి పట్టణం, మంచిర్యాల న్యాయవిభాగం న్యూస్‌టుడే

ష్టపడి పైకి వచ్చిన తల్లిదండ్రులను చూస్తూ పెరిగారు. సమాజ సేవ చేయాలనే తల్లిదండ్రుల ఆశయాన్నే సంకల్పంగా పెట్టుకున్నారు. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించి ప్రణాళిక నిర్ధేశించుకుని కష్టపడి చదివారు. పట్టుమని పాతికేళ్లకే తొలి ప్రయత్నంలోనే జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా ఎన్నికైన దామెర్ల ప్రీతిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

మందమర్రి పట్టణానికి చెందిన దామెర్ల సిద్దయ్య-రమా దంపతులకు కూతురు ప్రీతి, కొడుకు ప్రీతమ్‌ ఉన్నారు. తండ్రి సిద్దయ్య ఓయూలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రీతి చిన్నతనం నుంచి చదువులో ముందుండేది. సామాజిక సేవ చేయాలనే ఆలోచన ఉండడంతో స్కౌట్‌లో చేరారు. రెండు నేషనల్‌ జంబోరిలో పాల్గొని సత్తా చాటింది. హైదరాబాద్‌లోని కేశవ్‌ మెమెరియల్‌ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, నల్సార్‌ లా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్‌ ఆఫ్‌ లా)ను 2021లో పూర్తి చేశారు.  మార్చి 2022లో జూనియర్‌ సివిల్‌ జడ్జి నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ వెలువరించింది. ప్రణాళికాబద్ధంగా చదివారు. ఆగస్ట్‌లో ప్రిలిమినరీ, నవంబర్‌లో మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. పది రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ప్రీతి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా ఉద్యోగం సాధించి సత్తా చాటారు. ప్రీతికి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు స్ఫూర్తితోనే సాధించినట్లు ప్రీతి తెలిపారు. త్వరితగతిన కేసులు పరిష్కరించి సత్వరం న్యాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని