logo

అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నీటి విన్యాసాలు

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నీటి విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.

Updated : 16 Apr 2024 16:21 IST

ఎదులాపురం: అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నీటి విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆ శాఖ సిబ్బంది తెలంగాణ చౌక్‌లో నీటితో విన్యాసాలు చేపట్టారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే మంటను ఆర్పడానికి అవలంబించే పద్ధతులను ప్రదర్శించారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ కేశవులు, అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గోవర్ధన్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శివాజీల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని