logo

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ గౌస్ అలం

పంట పొలాల్లో గంజాయి సాగు చేసినా, అమ్మినా చట్టరిత్య చర్యలు తప్పవని ఎస్పీ గౌస్ అలం అన్నారు.

Updated : 16 Apr 2024 16:48 IST

ఇచ్చోడ: పంట పొలాల్లో గంజాయి సాగు చేసినా, అమ్మినా చట్టరిత్య చర్యలు తప్పవని ఎస్పీ గౌస్ అలం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం చమ్మనుగూడలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గంజాయి, గుడుంబా ఇతర మత్తు పానీయాలను సేవించడంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని వాటిని పూర్తిగా అరికట్టాలని సూచించారు. మత్తు పానీయాలు సేవించడంతోనే ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేందర్, సీఐ భీమేష్ ఎస్ఐలు, అటవీ సిబ్బంది  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని