logo

నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు పరిశీలన

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రేపటి నుంచి రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభం కానుంది.

Published : 17 Apr 2024 15:11 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రేపటి నుంచి రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం తో కలిసి పరిశీలించారు. 100 అడుగుల దూరంలో ఎవరిని అనిమతించకుండా బారికేడ్లు నిర్మించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్ రోడ్డు వైపు రాకపోకలు నిలిపివేయాలని, ట్రాఫిక్‌ను కుమురంభీం చౌక్ నుంచి ఎంపీడీఓ కార్యాలయ మార్గం గుండా మళ్లించాలని పోలీసులకు సూచించారు. వెంట ఐటీడీఏ పీవో ఖుష్భూ గుప్తా, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని