మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా..
మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన యువతి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం.. నలుగురికి గాయాలు
జాతీయ రహదారిపై పల్టీకొట్టిన కారు
కేతేపల్లి, న్యూస్‌టుడే: మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన యువతి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయవాడకు చెందిన కరణం పద్మా నాయుడు కుటుంబం కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. ఇటీవల వారి బంధువుల కుటుంబంలో జరిగిన వివాహానికి పద్మా నాయుడు కుమార్తె ప్రీతి వచ్చారు. ఆమె శనివారం రాత్రి అమెరికా వెళ్లాల్సి ఉంది. ప్రీతిని విమానాశ్రయంలో వదిలేందుకు సమీప బంధువులు శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. కారు చీకటిగూడెం శివారుకు రాగానే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళుతున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు జాతీయ రహదారిపై మూడు పల్టీలు కొట్టింది. తలకు తీవ్ర గాయాలైన కరణం ప్రీతి(21) అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న దొప్పలపూడి శ్రేయాస్, అందులో ప్రయాణిస్తున్న చేకూరి సరిత, దివి విశ్వవిఖ్యాత్, దివి పద్మావతిలకు గాయాలయ్యాయి. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రులను చికిత్స కోసం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని కేతేపల్లి ఏఎస్సై ఎన్.శ్రీనివాస్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Heera gold scam: హీరా గోల్డ్ కుంభకోణం.. రూ.33.06 కోట్ల ఆస్తుల అటాచ్
-
Movies News
Samantha: ఆ సమయంలో బయటకు కూడా రావాలనుకోలేదు: సమంత
-
Politics News
Bandi sanjay: పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ నిర్వాకమే కారణం: బండి సంజయ్
-
Politics News
Rahul disqualification: రాహుల్పై అనర్హత.. భాజపా సెల్ఫ్ గోల్: శశిథరూర్
-
Politics News
Minister KTR: భాజపాకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది: కేటీఆర్
-
Movies News
Ajay Devgn: నా వల్లే ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చింది: అజయ్ దేవ్గణ్