logo

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలి

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలని ఏడీసీపీ(అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌) వెంకటరత్నం సూచించారు.

Published : 10 Jun 2023 05:34 IST

'

ఏడీసీపీ వెంకటరత్నానికి జ్ఞాపిక బహూకరిస్తున్న నిర్వాహకులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలని ఏడీసీపీ(అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌) వెంకటరత్నం సూచించారు. స్థానిక ఆంధ్రా లయోలా కళాశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే 5వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలబాలికల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఆర్‌కే పురుషోత్తమ్‌తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ శిక్షకులు, సంఘ ప్రతినిధుల సూచనలు, సలహాలు పాటిస్తూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఆర్‌కే పురుషోత్తమ్‌ మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత నగరంలో జరుగుతున్న ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్‌ జిల్లా బాక్సింగ్‌ సంఘం కార్యదర్శి వైవీఎస్‌ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోటీల నిర్వహణకు సహకరించిన ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపల్‌ ఫాదర్‌ ఎస్‌జే కిషోర్‌, రాష్ట్ర బాక్సింగ్‌ సంఘం కార్యదర్శి లక్ష్మణ్‌దేవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బాక్సింగ్‌ ద్రోణాచార్య అవార్డీ ఐ.వెంకటేశ్వరరావు, రాష్ట్ర రెజ్లింగ్‌ సంఘం కార్యదర్శి వీవీ రమణ, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం సీఈవో శశికాంత్‌, కళాశాల వ్యాయామ విద్యా విభాగాధిపతి జేవీ నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.


స్కూల్‌ గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తా

పసిడి పతకంతో రేవతి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:  న్యూదిల్లీలో జరుగుతున్న 66వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-19 వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అల్లు రేవతి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 76 కేజీల బాలికల విభాగంలో తలపడిన రేవతి స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 85 కేజీలతో మొత్తం 163 కేజీల బరువెత్తి ప్రథమ స్థానంలో నిలిచింది. రేవతి ఏలూరులోని శాయ్‌ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా కేంద్రంలో శాయ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ వై.ఉదయ్‌ సందీప్‌ పర్యవేక్షణలో సాధన చేస్తోందని రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని