logo

ఇసుక రేవులకు పర్యావరణ అనుమతి

జిల్లాలో కొత్తగా 12 బహిరంగ (ఓపెన్‌ రీచ్‌)ఇసుక రేవులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు గనులు, భూగర్భ శాఖ జిల్లా ఉప సంచాలకులు సుబ్రహ్మణ్వేశ్వర రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రేవుల్లో 6,01,646 టన్నుల ఇసుక అందుబాటులోకి రానుంది.

Published : 21 Jan 2022 06:24 IST

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా 12 బహిరంగ (ఓపెన్‌ రీచ్‌)ఇసుక రేవులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు గనులు, భూగర్భ శాఖ జిల్లా ఉప సంచాలకులు సుబ్రహ్మణ్వేశ్వర రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రేవుల్లో 6,01,646 టన్నుల ఇసుక అందుబాటులోకి రానుంది. సదరు రేవుల్లో తవ్వకాలు, రవాణా ప్రారంభించాలని జయప్రకాష్‌ వెంచర్స్‌ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు. హిందూపురం మండలం సంతేబిదనూరు, పామిడి మండలంలో వంకరాజు కాల్వ, తంబళ్లపల్లె, బెళుగుప్ప మండలంలో నర్సాపురం, కంబదూరు మండలంలో చెన్నంపల్లి, బ్రహ్మసముద్రం మండలంలో అజయ్యదొడ్డి, కణేకల్లు మండలంలో రచ్చుమర్రి, తాడిపత్రి మండలంలో ఆలూరు, వంగనూరు, పెద్దపప్పూరు మండలంలో ధర్మాపురం, యల్లనూరు మండలంలో చింతకాయమంద, చిలమకూరుల్లో రేవులకు అనుమతులు మంజూరు అయ్యాయి. ఇక్కడ ఇసుక అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డీడీ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని