logo

నియంత్రించాల్సిన చోటా.. విస్తరిస్తోంది!

కరోనాను నియంత్రించాల్సిన చోటే విస్తరించేందుకు కారణం అవుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే కరోనా అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌ వస్తే.. అక్కడే రోగికి మందుల చీటీ రాసిస్తున్నారు. సాధారణ రోగులు తీసుకునే మందుల గది వద్దే కరోనా బాధితులు

Published : 23 Jan 2022 03:17 IST

ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సిబ్బంది

కరోనాను నియంత్రించాల్సిన చోటే విస్తరించేందుకు కారణం అవుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే కరోనా అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌ వస్తే.. అక్కడే రోగికి మందుల చీటీ రాసిస్తున్నారు. సాధారణ రోగులు తీసుకునే మందుల గది వద్దే కరోనా బాధితులు సైతం బారులు తీరుతున్నారు. విషయం తెలుసుకున్న కొందరు సాధారణ రోగులు భయాందోళన చెందుతున్నారు. పరీక్షలు జరిపిన చోటే మందులు ఇస్తే.. ఎలాంటి ముప్పు ఉండదని పలువురు పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - ఈనాడు, అనంతపురం

సాధారణ రోగులతోపాటు మందులు తీసుకెళ్తూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని