logo

ఒక కిలోమీటరు.. ఒక జీవితం!

జిల్లాలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన, పేద పిల్లల దత్తత, నిధుల సేకరణ కోసం ఏటా చేపడుతున్న అల్ట్రా మారథాన్‌ పరుగు ఈసారి నిరాడంబరంగా ముగించారు. ఒక కిలోమీటరు.. ఒక జీవితం నినాదంతో శనివారం ఈ పరుగు ఎనిమిది దేశాల్లో నిర్వహించారు.

Published : 23 Jan 2022 03:17 IST

అనంతలో అల్ట్రా మారథాన్‌ పరుగు

పరుగు తీస్తున్న అథ్లెట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన, పేద పిల్లల దత్తత, నిధుల సేకరణ కోసం ఏటా చేపడుతున్న అల్ట్రా మారథాన్‌ పరుగు ఈసారి నిరాడంబరంగా ముగించారు. ఒక కిలోమీటరు.. ఒక జీవితం నినాదంతో శనివారం ఈ పరుగు ఎనిమిది దేశాల్లో నిర్వహించారు. కరోనా కారణంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా పూర్తి చేశారు. అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో చేపట్టిన మారథాన్‌ పరుగులో 54 మంది పాల్గొన్నారు. మొత్తం పది కి.మీ. పరిగెత్తారు. ఇందులో 10 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. అలాగే స్పెయిన్‌, జర్మనీ, అమెరికా, ఐర్లాండ్‌, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా దేశాల్లోనూ పరుగు నిర్వహించినట్లు ఆర్డీటీ పీడీ మాంచోఫెర్రర్‌ తెలిపారు. ఆర్డీటీ అందిస్తున్న సేవలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో స్పెయిన్‌ మారథాన్‌ అథ్లెట్‌ జువాన్‌ మానువెల్‌ 2016లో పరుగు ప్రారంభించారని, కిలోమీటరుకు ఒకరు చొప్పున పేదలను దత్తత తీసుకుని, వారికి అన్నివిధాలా సాయం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటివరకు 550 మంది చిన్నారులను దత్తత తీసుకుని, విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. 1969లో ప్రారంభమైన ఆర్డీటీ సేవలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 3,700 గ్రామాలకు విస్తరించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని