logo

ఉన్నత చదువులకు విద్యాదీవెన ఉపయుక్తం

పిల్లలు ఉన్నత విద్య అభ్యసించినా తల్లిదండ్రులకు ఏవిధమైన భారం లేకుండా ఉండటానికి విద్యాదీవెన అందుతోందని కలెక్టరు నాగలక్ష్మి పేర్కొన్నారు. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాల్లో గురువారం విద్యాదీవెన కింద ఫీజులను

Published : 12 Aug 2022 04:47 IST

నమూనా చెక్కు అందజేస్తున్న కలెక్టరు నాగలక్ష్మి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ,

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఉపమేయర్లు విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి

అనంత సంక్షేమం,న్యూస్‌టుడే: పిల్లలు ఉన్నత విద్య అభ్యసించినా తల్లిదండ్రులకు ఏవిధమైన భారం లేకుండా ఉండటానికి విద్యాదీవెన అందుతోందని కలెక్టరు నాగలక్ష్మి పేర్కొన్నారు. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాల్లో గురువారం విద్యాదీవెన కింద ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 49,183 మంది విద్యార్థులకు రూ.28.58 కోట్లు తల్లుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కలెక్టరు 22 ఏళ్లకు ఐఏఎస్‌ అయ్యారని, మీరు కూడా ఉన్నత ఆలోచనలతో ముందుకు పయనించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి విశ్వమోహన్‌రెడ్డి, ఉపమేయర్లు విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, ఆర్ట్స్‌ కళాశాల ప్రధానాచార్యులు దివాకర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని