logo

పేదల కాలనీల్లో మట్టి.. పెద్దల ఆవాసాలకు సిమెంటు

ధర్మవరం పట్టణంలో పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. కాలనీలు ఏర్పడినప్పుడు వేసిన మట్టి రహదారులపైనే రాకపోకలు చేస్తున్నారు. గుంతలు పడి రాళ్లు తేలి అధ్వానంగా ఉన్నా.. తట్టెడు మట్టి కూడా వేయలేదు. వర్షాల ధాటికి దారులు

Published : 30 Sep 2022 03:16 IST

వైఎస్సార్‌ కాలనీలో ప్రధాన రహదారి ఇలా..

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణంలో పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. కాలనీలు ఏర్పడినప్పుడు వేసిన మట్టి రహదారులపైనే రాకపోకలు చేస్తున్నారు. గుంతలు పడి రాళ్లు తేలి అధ్వానంగా ఉన్నా.. తట్టెడు మట్టి కూడా వేయలేదు. వర్షాల ధాటికి దారులు కోతకు గురై కాలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. ధర్మవరం వైఎస్సార్‌ కాలనీ 2007లో ఏర్పాటైంది. ఇక్కడి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన శివరామనగర్‌లో ఇటీవల 4 గృహాలు నిర్మించారు. ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతం కావడంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రజాప్రతినిధులు సిఫారసు చేశారు. పురపాలకశాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయించారు. కొన్నేళ్లుగా విన్నవిస్తున్నా రహదారి నిర్మాణం చేపట్టలేదని వైఎస్సార్‌ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శివరామనగర్‌లో నాలుగు ఇళ్లకే సీసీ రోడ్డు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని