logo

ఆర్బీకేల్లో రైతుల వేలిముద్రల నమోదు

పంట వివరాలతో పాటు పంట ఫొటో తీసుకున్న ప్రతి రైతు నుంచి రైతు భరోసా కేంద్రాల్లో వేలిముద్రల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల ఒకటో తేదీన ‘ఈనాడు’లో ‘నమోదు తప్ప.. వేలిముద్ర పడదప్పా!’ శీర్షిక ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయాధికారి చంద్రనాయక్‌ స్పందించారు.

Published : 04 Oct 2022 02:35 IST

మహిళా రైతులతో వేలిముద్రలు తీసుకుంటున్న సిబ్బంది

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: పంట వివరాలతో పాటు పంట ఫొటో తీసుకున్న ప్రతి రైతు నుంచి రైతు భరోసా కేంద్రాల్లో వేలిముద్రల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల ఒకటో తేదీన ‘ఈనాడు’లో ‘నమోదు తప్ప.. వేలిముద్ర పడదప్పా!’ శీర్షిక ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయాధికారి చంద్రనాయక్‌ స్పందించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ హరికిరణ్‌ దృష్టికి తీసుకెళ్లి, సర్వర్‌ను పునరుద్ధరించారు. ఆదివారం, సోమవారం వరుస సెలవులు వచ్చినా ఆర్బీకే సిబ్బంది, ఏవోలు, ఏఈవోలు ఆర్బీకేల్లో కూర్చొని వేలిముద్రల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో సమాచారం చేరవేయడంతో రైతులు ఆర్బీకేలకు పరుగులు తీసి వేలిముద్రలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని