logo

‘టిడ్కో ఇళ్లు.. ఎప్పుడిస్తారన్నా’

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ విమర్శించారు.

Published : 02 Dec 2022 06:08 IST

అర్ధాంతరంగా ఆగిన ఇళ్ల వద్ద నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ విమర్శించారు. గురువారం సీపీఐ నాయకులు ప్లకార్డులు, జెండాలు పట్టుకుని చిన్మయనగర్‌ వద్ద నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాఫర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయలేకపోతున్నారన్నారు. నిర్మాణాలు శిథిలావస్థకు చేరుతున్నాయన్నారు. పునాదుల్లో వర్షపు నీరు చేరి కుంటలను తలపిస్తున్నాయని, పిల్లర్లు తుప్పుపట్టాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి గృహాలను పూర్తిచేసి తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల ఐదు, ఆరు తేదీల్లో అన్ని మున్సిపల్‌, తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు కుళ్లాయిస్వామి, రాజేష్‌గౌడ్‌, కృష్ణుడు, నారాయణస్వామి, జయలక్ష్మి, చాంద్‌బాషా, ప్రసాద్‌, మునాఫ్‌, కుర్షీదా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని