8 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృతి
ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఆ యువకుడు కలలు కన్నాడు. మరో ఎనిమిది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అతడిపై కాలానికి కన్ను కుట్టింది.
నాగవర్ధన (దాచిన చిత్రం)
అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఆ యువకుడు కలలు కన్నాడు. మరో ఎనిమిది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అతడిపై కాలానికి కన్ను కుట్టింది. పెళ్లి వస్త్రాలు కొనుక్కుని సంతోషంతో ఇంటికి బయలుదేరిన అతను తిరిగి రాని లోకానికి వెళ్లాడు. వివరాలు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పాపంపల్లి గ్రామానికి చెందిన తలారి ఎల్లప్ప, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు నాగవర్ధన (27) సొంతూరు నుంచి అనంతపురం నగరానికి వెళ్లి డోర్ పాలిషింగ్ కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇతనికి ఇటీవల కూడేరుకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 11న ముహూర్తం ఖరారు చేశారు. ఈ లోపు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం పెళ్లి వస్త్రాలు కొనుగోలుకు మిత్రుడితో కలిసి అనంతపురం వచ్చాడు. షాపింగ్ పూర్తి చేసుకుని గ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. నగరంలోని శ్రీకంఠం కూడలి సమీపంలోని ఆటో స్టాండు వద్దకు రాగానే ఉన్నఫళంగా బైకును నిలిపాడు. గుండెలో నొప్పిగా ఉందంటూ మిత్రునితో చెబుతూ కిందికి దిగి కూర్చుని వాలిపోయాడు. సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్లు, స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో చికిత్స కోసం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే మృతి చెందాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను సైతం కదిలించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Republic Day: ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘ఆత్మనిర్భర్’ ఆయుధాలు
-
Movies News
Keeravani: ఇది నా విజయం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిది..: కీరవాణి
-
General News
Republic Day: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
-
General News
Republic Day: ప్రగతిభవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం కేసీఆర్
-
World News
Trump: ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల పునరుద్ధరణ
-
Sports News
IND vs PAK: జైషాతో తప్పకుండా చర్చిస్తా.. పాక్ క్రికెట్‌కు ప్రయోజనం: నజామ్ సేథీ