logo

సరస్వతీ నిలయం.. కస్తూర్బా విద్యాలయం

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా, మిగులు సీట్ల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

Published : 27 Mar 2023 05:22 IST

ప్రవేశాలకు అవకాశం
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

కేబీబీవీ విద్యాలయం

అనంతపురం విద్య, న్యూస్‌టుడే : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా, మిగులు సీట్ల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఏప్రిల్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన, బడిమానేసి చదువుకు దూరమైన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్‌, వలస కుటుంబాలకు చెెందిన బాలికలు మాత్రమే దరఖాస్తునకు అర్హులు. విద్యార్థి పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌, కుల, ఆదాయ, రేషన్‌కార్డు నకలు, పాస్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సందేహాలకు ఆయా కేజీబీవీల్లోని ప్రిన్సిపాళ్లను సంప్రదించాల్సి ఉంటుంది..

ఖాళీలు ఇలా..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 62 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 40 సీట్లు ఉంటాయి. ఈ లెక్కన మొత్తం 2,480 సీట్లు భర్తీ చేయనున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశానికి సంబంధించి ఒక్కో కేజీబీవీలో 40 సీట్లు మేర 62 కేజీబీవీల్లో 2,480 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటితోపాటు 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తారు.

ప్రత్యేకతలు: బోధకులంతా మహిళలే. ప్రతి సబ్జెక్టుకు బోధకులు ప్రత్యేకంగా ఉంటారు. క్రీడలు, యోగా, సాంస్కృతిక, స్వయం ఉపాధి తదితర వాటిల్లో శిక్షణ ఇస్తారు. అవసరమైన సామగ్రి, దుస్తులు, దుప్పట్లు అన్ని ఉచితమే. పోషకాలతో కూడిన ఆహారం, వారంలో ఐదు రోజులు గుడ్డు, అల్పాహారం, ప్రతి ఆదివారం మధ్యాహ్నం కోడికూరతో భోజనం వడ్డిస్తారు.

వెబ్‌ సైట్‌ : apkgbv.apcfss.in దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి

2023-24 విద్యాసంవత్సరానికి మిగిలిపోయిన సీట్లలో భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. 6, 7, 8, 9, 11 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. ఏప్రిల్‌ 20 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్లకు పరిగణిస్తాం. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం పంపిస్తాం.

సాయిరాం, డీఈవో, అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని