logo

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయితే అనంత సస్యశ్యామలం

యువగళం పాదయాత్రలో భాగంగా రాయలసీమ మిషన్‌ ప్లానింగ్‌ పేరుతో కడపలో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి అనంత జిల్లా నుంచి తెలుగుదేశం నాయకులు తరలి వెళ్లారు. 

Published : 08 Jun 2023 05:58 IST

లోకేశ్‌తో కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్‌, గుండుమల తిప్పేస్వామి తదితరులు

జిల్లా వ్యవసాయం: యువగళం పాదయాత్రలో భాగంగా రాయలసీమ మిషన్‌ ప్లానింగ్‌ పేరుతో కడపలో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి అనంత జిల్లా నుంచి తెలుగుదేశం నాయకులు తరలి వెళ్లారు.  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిసి  పెండింగ్‌ ప్రాజెక్టుల స్థితిగతులను చర్చించారు. లేపాక్షి నాలెడ్జ్‌ హాబ్‌ కోసం రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తక్కువ ధరకే భూములను తీసుకున్నారని, యువకులకు ఉద్యోగాలిస్తామన్నారని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఉద్యోగాల కోసం సీమ ప్రజలు వలసలు వెళ్లారన్నారు. చిలమత్తూరులో ఇందూ గ్రూపునకు కేటాయించిన భూమిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కేవలం రూ.500 కోట్లకు వేరే కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం అతీగతీ లేదని విమర్శించారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు 30 శాతం కాలువ పనులు పూర్తి చేశారని, ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఆగిపోయాయన్నారు. జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని వివరించారు. తాగు, సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారని జిల్లా నాయకులు లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు.  వీటిని పూర్తిచేస్తే ఉమ్మడి అనంత సస్యశ్యామలం అవుతుందన్నారు.  కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్‌, గుండుమల తిప్పేస్వామి, ఉమామహేశ్వర నాయుడు, మంద మంచి స్వరూప, బండారు శ్రావణి పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని