logo

రూ.1.67 కోట్ల మళ్లింపుపై కేసు

కదిరి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్‌ ఆఫీసర్‌) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్‌ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 28 Mar 2024 04:45 IST

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : కదిరి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్‌ ఆఫీసర్‌) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్‌ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ ఖాతాల తనిఖీలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ బ్యాంకును మోసగించినట్లు తేలినట్లు రీజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు కదిరి అర్బన్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ వెంకటనాయుడు స్టేట్‌ బ్యాంక్‌ కదిరి వ్యవసాయ విభాగంలో 2021 జులై నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఓడీ ఖాతాల నుంచి నగదును ఆయన 13 సేవింగ్‌ ఖాతాలకు మళ్లించినట్లు తనిఖీలో గుర్తించామని రీజనల్‌ మేనేజర్‌ తెలిపారు. సేవింగ్‌ ఖాతాల నుంచి ఆవుల భానుప్రవీణ్‌రెడ్డి ఖాతాకు రూ.1,67,84,384లను బదిలీ చేసినట్లు గుర్తించిన అధికారులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీజనల్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు ఫీల్డ్‌ ఆఫీసర్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని