logo

శిక్షణ లేకుండానే సివిల్స్‌లో 480వ ర్యాంకు

ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో గుంతకల్లుకు చెందిన ధనుశ్‌ జాతీయ స్థాయిలో 480వ ర్యాంకుతో సత్తా చాటాడు

Published : 17 Apr 2024 05:50 IST

గుంతకల్లు, న్యూస్‌టుడే : ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో గుంతకల్లుకు చెందిన ధనుశ్‌ జాతీయ స్థాయిలో 480వ ర్యాంకుతో సత్తా చాటాడు. ధనుశ్‌ తల్లి నాగమణి గుంతకల్లు రైల్వేలో అకౌంట్స్‌ విభాగంలో సీనియర్‌ ఆడిటర్‌గా పని చేస్తూ ఇటీవలే సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యారు. తండ్రి శ్రీనివాసులు   హైదరాబాదులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ధనుశ్‌ పుట్టి పెరిగింది గుంతకల్లులోనే. బీటెక్‌ పూర్తి చేశారు. సర్వీస్‌ కమిషన్‌కు సంబంధించి జాగ్రఫీని పాఠ్యాంశంగా ఎంపిక చేసుకుని పరీక్షకు, ఇంటర్వ్యూకు హాజరై ఉత్తీర్ణత సాధించారు.

పుస్తకాలు, దినపత్రికలు చదివా:  ధనుశ్‌

 యూపీఎస్సీ పరీక్ష కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు, ఆంగ్ల దినపత్రికలు ఎక్కువగా చదివేవాడిని. వాటిల్లోని ముఖ్యాంశాలను రాసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యా. ఆన్‌లైన్‌లోనూ యూపీఎస్సీ పరీక్షకు సంబంధించి పలు అంశాలను శోధించే వాడిని. సమయ పాలన పాటించడంతో అన్ని అంశాలపై పట్టు సాధించా. పరీక్ష అంటే భయం లేకుండా నమ్మకంతో చదివా. అఖిల భారత అటవీ శాఖ అధికారిగా కొలువు సాధించాలని ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని