logo

జగనాసురుడి దమనకాండ

అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. అన్యాయాన్ని నిలదీస్తే ఎదురుదాడులు.. అవినీతిపై ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. జగనన్న ఐదేళ్ల పాలన సాగిన తీరిది. ప్రశ్నించడం దేవుడెరుగు ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళ్లినా తలలు పగలగొట్టారు.

Updated : 10 May 2024 05:47 IST

వైకాపా ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే దాడులు
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అవినీతి, అక్రమాలు
ఉమ్మడి అనంత జిల్లాలో జగన్‌ ఐదేళ్ల పాలన తీరిది

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. అన్యాయాన్ని నిలదీస్తే ఎదురుదాడులు.. అవినీతిపై ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. జగనన్న ఐదేళ్ల పాలన సాగిన తీరిది. ప్రశ్నించడం దేవుడెరుగు ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళ్లినా తలలు పగలగొట్టారు. కులం చూడం అంటూనే.. కుల రాజకీయాలు చేస్తూ బడుగులపై దాడులకు తెగపడుతున్నారు. పార్టీలు చూడమంటూనే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను పొట్టనపెట్టుకుంటున్నారు. నా ఎస్సీలు అంటూనే దళితులపై దమనకాండ కొనసాగించారు. బడుగు వర్గాలకు గత ప్రభుత్వాలు కేటాయించిన అసైన్డ్‌ భూముల్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. అడ్డుపడినవారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారు. కొందరు పోలీసులను అడ్డుపెట్టుకుని జనాలను వేధింపులకు గురిచేశారు. వైకాపా నాయకుల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేస్తే బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు జగన్‌ ఏనాడూ ప్రయత్నించలేదు. బాధితుల గోడుపై కనీసం సమీక్షించలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్యాలెస్‌ దాటి బయటకొచ్చి నా ఎస్సీలు, నా బీసీలు అంటూ కపట ప్రేమ నటిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికిజ ఎన్నికల్లో మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే అరాచకవాదులకు లైసెన్స్‌లు ఇచ్చినట్లే.


త్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తెదేపా నాయకులు పరిటాల సునీత నామినేషన్‌ కార్యక్రమానికి వెళుతుండగా వెళ్లొద్దంటూ వైకాపా నాయకులు హెచ్చరించారు. అయినా పెద్దఎత్తున తోపుదుర్తి గ్రామం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దీనిని మనస్సులో ఉంచుకున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త వన్నూరప్ప తదితరులపై దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేశాడు.


తోపుదుర్తి సోదరుల దౌర్జన్యం

రాప్తాడు, ఆత్మకూరు, రామగిరి: రాప్తాడు నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా అభివృద్ధి కంటే ఎమ్మెల్యే, ఆయన సోదరులు, అనుచరులు చేసిన అకృత్యాలే ఎక్కువ దర్శనమిస్తాయి. పంచాయతీలతో మెదలైన వీరి ఆగడాలు భూఆక్రమణలు, మట్టి మాఫియా వరకు సాగింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, చివరికి తమ మాట వినని, దారికిరాని ఐదారుగురు సొంత పార్టీవారిపైనే దౌర్జన్యాలు, భౌతిక దాడుల పరంపర కొనసాగించారు.


చెన్నేకొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన గోపాల్‌నాయక్‌ అనేవ్యక్తి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన డి.పట్టా భూమి తమదంటూ వైకాపా కార్యకర్తలు దౌర్జన్యం చేసి మామిడి మొక్కలను తొలగించారు. భూమిలోకి వస్తే అంతు చూస్తానంటూ బెదిరించారు.


రామగిరి మండలం కుంటిమద్దిచెరువు కట్టపై 2022 ఆగస్టు 26న చెన్నేకొత్తపల్లి మాజీ ఎంపీపీ అమరేంద్రతోపాటు గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపాలోకి చేరేందుకు వెంకటాపురం వెళుతుండగా తోపుదుర్తి రాజశేఖరరెడ్డితోపాటు వారి అనుచరులు వాహనాన్ని అడ్డగించి దాడులకు పాల్పడ్డారు.


కూల్చేసి.. నిరాశ్రయులను చేసి

కళ్యాణదుర్గం గ్రామీణం: పట్టణంలోని టీ కూడలి సమీపంలో ఉన్న మున్సిపల్‌ భవనాన్ని కూల్చి నూతన సముదాయం నిర్మించేందుకు వైకాపా ప్రభుత్వం రెండేళ్ల కిందట పట్టుపట్టింది. అక్కడే ఉన్న కూరగాయలు, ఆకుకూరల వ్యాపారులు అనువైన స్థలం చూపాలంటూ పట్టుబట్టారు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు, ఆ పార్టీ నాయకులు అర్ధరాత్రి సమయంలోనే దౌర్జన్యంగా అక్కడి దుకాణాలను పొక్లెయిన్లతో తొలగించారు. దీంతో సుమారు 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగితే పట్టణానికి దూరంలో ఉన్న దొడగట్ట రోడ్డులోని మార్కెట్‌యార్డులో కూరగాయల మార్కెట్‌ నిర్వహించేలా చర్యలు తీసుకొన్నారు. అంతదూరం ప్రజలు రాలేకపోయారు. దీంతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం పక్కనే ప్రభుత్వ స్థలంలో మార్కెట్‌ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. అక్కడికి వ్యాపారులు రాకపోవడంతో చాలా అంగళ్లు మూతపడ్డాయి. ఆశ్రయం కోల్పోయిన చిరువ్యాపారులు రోడ్డు పక్కనే కొద్దిపాటి చోట వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని