logo

400 ఆర్‌బీకేల్లో అందుబాటులో ఎరువులు

జిల్లాలోని ఆర్‌బీకేల్లో రసాయన ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని మార్క్‌ఫెడ్‌ డీఎం(ఎరువులు) నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 746 ఆర్‌బీకేలు ఉండగా.. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా 400 ఆర్‌బీకేల్లో ఎరువులు నిల్వ చేశామన్నారు. యూరియా

Published : 21 Jan 2022 02:24 IST

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని ఆర్‌బీకేల్లో రసాయన ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని మార్క్‌ఫెడ్‌ డీఎం(ఎరువులు) నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 746 ఆర్‌బీకేలు ఉండగా.. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా 400 ఆర్‌బీకేల్లో ఎరువులు నిల్వ చేశామన్నారు. యూరియా రెండు వేల టన్నులు, కాంప్లెక్స్‌ 900 టన్నులు, డీఏపీ 60 టన్నులు, మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ 200 టన్నులు నిల్వ ఉన్నాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని