logo

‘ఉద్యోగులపై ప్రభుత్వ దాడి తగదు’

చిత్తూరులో చదువుల తల్లులు, ఉద్యోగులు, మేధావులపై ప్రభుత్వం దాడి చేయడం తగదని, ఉద్యోగులు వారి హక్కులను అడిగే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిలదీశారు. గురువారం నగరి మండలం ఐనంబాకంలో ఆయన మాట్లాడారు. తమకు రావాల్సినది

Published : 21 Jan 2022 02:24 IST


నారాయణ

నగరి: చిత్తూరులో చదువుల తల్లులు, ఉద్యోగులు, మేధావులపై ప్రభుత్వం దాడి చేయడం తగదని, ఉద్యోగులు వారి హక్కులను అడిగే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిలదీశారు. గురువారం నగరి మండలం ఐనంబాకంలో ఆయన మాట్లాడారు. తమకు రావాల్సినది ఉద్యోగులు అడిగితే ఆర్థిక పరిస్థితి అంటున్నారు.. అయిదు విడతల డీఏలను పెండింగ్‌ పెట్టి ఒక్కసారిగా ఇచ్చారన్నారు. 27 శాతాన్ని 23 శాతానికి తగ్గించి, హెచ్‌ఆర్‌ఏను 50 శాతం తగించి మాట్లాడే చీఫ్‌ సెక్రెటరీ చదువుకున్నారా? లేదా? అని ప్రశ్నించారు. ఒకవైపు డబ్బులు లేవంటారు.. సలహాదారులను మాత్రం నియమించుకొని దోచిపెడుతుంటారా? ఒక్కొక్క సలహా దారు పనిచేయకుండా విలాసవంతంగా ఖర్చు చేస్తుంటారా? అని నిలదీశారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్జీఓ సంఘాలన్నీ ఏకమై ప్రత్యక్ష ఆందోళనలు చేపడతాయని, వారికి భారతీయ కమూనిస్టు పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు.

తిరుపతి(నగరం): తమ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమాన్ని పోలీసులు అడ్డుకుని వారిని నిర్బంధించడం అప్రజాస్వామ్యమని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేసేందుకు వెళ్తున్న ఉపాధ్యాయులను రోడ్లపైన అడ్డుకుని పోలీసులు జులుం ప్రదర్శించడం బాధాకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని