logo

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: ఎస్పీ

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు.

Published : 03 Dec 2022 01:52 IST

రోడ్‌సేఫ్టీ మొబైల్‌ వాహనాలకు ట్రాఫిక్‌ పరికరాలు పంపిణీ చేస్తున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన రోడ్‌ సేఫ్టీ మొబైల్‌ వాహనాలకు ట్రాఫిక్‌ పరికరాలు పంపిణీ చేశారు. రోడ్డు భద్రతా నియమాలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. మోటారు వాహనాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఇందుకు జిల్లాలో ఏడు రోడ్‌ సేఫ్టీ మొబైల్‌ వాహనాలకు ట్రాఫిక్‌ పరికరాలు పంపిణీ చేశామని చెప్పారు. ఈ వాహనాల్లోని అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తమై అందరూ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ కోన్స్‌, రిఫ్లెక్టివ్‌ జాకెట్లు, ట్రాఫిక్‌ బటన్‌ లైట్‌, రిఫ్లెక్ట్‌ టేప్‌, క్రైం సీన్‌ టేప్‌, టార్చ్‌ లైట్‌, ప్రథమ చికిత్స కిట్‌, 24ఎంఎం నైలాన్‌ రోప్‌, రెయిన్‌ కోట్స్‌, ఫైబర్‌ లాఠీ, 20 లీటర్ల నీటి క్యాన్‌లు వీటిలో ఉన్నాయని చెప్పారు. అంబులెన్సు సేవలు వినియోగించడం లేక పోలీసు వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సేవలను అందించాలన్నారు. ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరెడ్డి, బాబుప్రసాద్‌, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని