logo

సరస్వతి నివాసం.. సమస్యలతో సహవాసం

కమ్మనపల్లె గురుకుల బాలికల పాఠశాలలో డార్మెటరీ వసతి లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లోనే సామగ్రిని ఉంచుకుని ఇరుకు గదుల్లో అక్కడే విద్యాభ్యాసం సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

Published : 05 Feb 2023 01:56 IST

కమ్మనపల్లె గురుకుల బాలికల పాఠశాలలో డార్మెటరీ వసతి లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లోనే సామగ్రిని ఉంచుకుని ఇరుకు గదుల్లో అక్కడే విద్యాభ్యాసం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలో దాదాపు 480 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కలెక్టరు, గురుకుల పాఠశాలల రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదు.

న్యూస్‌టుడే, బైరెడ్డిపల్లె శాంతిపురం మండలంలోని

 


64- పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘నాడు- నేడు’ నిర్మాణాలకు ప్రభుత్వం రెండు నెలల కిందట సరఫరా చేసిన 800 బస్తాల సిమెంట్‌ను తరగతి గదిలో భద్రపరిచారు. గది నిండా సిమెంట్‌ను నిల్వ చేయడంతో పదో తరగతి విద్యార్థులు ఇలా సిమెంట్‌ బస్తాలను ఆనుకొని కూర్చొని ఇబ్బందులు పడుతూ.. చదువులు సాగించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

న్యూస్‌టుడే, కుప్పం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని